ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగు చూసింది.

Update: 2024-11-21 14:52 GMT

దిశ, కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగు చూసింది. మహా సముద్రం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..పానగల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ తో వివాహమైంది. అయితే భార్య ప్రశాంతి(21) భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చింది.  గురువారం భర్త బాలకృష్ణ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో వచ్చి..భార్య ప్రశాంతిని తీవ్రంగా కొట్టి చంపి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసి పరారైనట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రశాంతి గర్భవతి అని సమాచారం. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News