Breaking News : మాగనూర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్

నారాయణపేట జిల్లాలోని మాగనూరు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ తీసుకుంది.

Update: 2024-11-21 13:12 GMT

దిశ, వెబ్ డెస్క్/మక్తల్/మాగనూరు: నారాయణపేట జిల్లాలోని మాగనూరు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఎంఈవో మురళీధర్ రెడ్డి, సంఘటన జరిగే సమయంలో ఇన్ఛార్జీగా ఉన్న బాబురెడ్డిని సస్పెండ్ చేయగా.. వంట ఏజెన్సీలను రద్దు చేసింది. కాగా నేడు మరోసారి మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పాఠశాల ముందు ధర్నాకు దిగారు. దీనిపై ప్రభుత్వం మరోసారి సీరియస్ అయి.. డీఈవో అబ్దుల్ ఘనినిను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో రామచందర్ కు షోకాజ్ నోటీసులు అందించారు. అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

బుధవారం మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడంతో వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా.. పలువురుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత జరిగిన సంబంధిత డీఈవో, ఆర్డిఓ, ఎంపీడీవో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఫుడ్ పాయిజన్ కు కారణమైన బియ్యంను మళ్లీ వంటకు ఉపయోగించడం, అందులో పురుగులు ఉండడాన్ని విద్యార్థులు గుర్తించడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు. సస్పెన్షన్, షోకాస్ నోటీసులు విచారణ పెండింగ్ లో ఉంచి తక్షణం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.    


Similar News