అవిశ్వాసానికి 3 నెలల.. హైడ్రామాతో కొనసాగిన సమావేశం
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్‌లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశం నాటకీయ పరిణామాల మధ్య గురువారం విషయం విధితమే.
దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్‌లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశం నాటకీయ పరిణామాల మధ్య గురువారం విషయం విధితమే. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీపీ ఉండడంతో అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీపీ పీఠంను బీఆర్ఎస్ పార్టీకి దక్కించుకోవాలని ఎంపీటీసీలు మూకుమ్మడిగా పట్టు పట్టడంతో నిన్న సర్వసభ్య సమావేశం వాయిదా పడి శుక్రవారం పున: ప్రారంభమైంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాలు చూయించుకోవడానికి మండలంలో ఉన్న ఎంపీటీసీలు అందరూ హాజరైనప్పటికినీ, నిన్న జరిగిన విషయంను లేవ నెత్తకుండా సర్వసభ్య సమావేశాన్ని సాఫీగా నడిపించారు. సమావేశం కొనసాగుతుందా లేదా.. అవిశ్వాస తీర్మానానికి ఎంపీటీసీలు లెవనెత్తుతార అనే ఉత్కంఠ కాసేపు కొనసాగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బలాబలాలు నిరూపించుకోవడానికి తమకు సంబంధించిన చిన్న పార్టీ లీడర్ నుండి బడా నాయకులు మండల పరిషత్ కార్యాలయంకు చేరుకోవడంతో హడావుడి కనిపించింది. ఎన్నికల సమయంలో ఏ విధంగా నాయకులు వస్తారో ఆ విధంగా ఒక్కసారిగా మండల పరిషత్ కు ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు రావడంతో.. ఏమో జరుగుతుందని ఊహగానలు కనిపించాయి. కాస్త ముందుగానే ఎంపీటీసీలను ఒక్కొక్కరిగా బుజ్జగిస్తూ ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమయ్యారు. చివరకు ఎంపీటీసీలు మాత్రం ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా.... అవిశ్వాసం పెట్టాలన్న ఇంకా 3 నెలల సమయం ఉంది కదా అని ఆలోచనలో చేసి ఆ విషయాన్ని పక్కకు పెట్టి సర్వసభ్య సమావేశాన్ని కొనసాగించుటకు ముందుకు రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వాడివిడిగా కొనసాగిన సర్వసభ్య సమావేశం..
సర్వసభ్య సమావేశానికి మాత్రం మండల స్థాయి అధికారులు నామమాత్రంగా హాజరయ్యారు. హాజరుకాని అధికారులు అందరిపై చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వాలని మూకుమ్మడిగా ఎంపీటీసీలు తీర్మానం చేశారు. ప్రతి సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన అంశాలే లేవనెత్తడం.. వాటిని చేస్తామని అధికారులు చెప్పడం పరిపాటిగా మారింది.
గట్టులో కొనసాగుతున్న మానవపాడు గురుకుల పాఠశాలను గత ఐదేళ్లుగా మానవపాడుకు మార్చుతామని హామీలు ఇస్తున్నారు తప్ప అధికారులు పాలకులు ఈ గురుకులపై దృష్టి సాధించడం లేదని మండల విద్యాధికారిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మాత్రం అయోమయంలో ఉండడంతో పాటు చదువులు సరిగ్గా సాగడం లేదని తల్లిదండ్రులు కూడా వాపోతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
మూడు మండలాలకు సంబంధించి విద్యుత్ సరఫరాకు చెందిన ఫీడర్ లేకపోవడంతో ఏ గ్రామంలో కరెంటు సమస్య వచ్చినా మూడు మండలాలకు కరెంటు కోత పెడుతున్నారని, వాటిపై ఎందుకు దృష్టి సారించడం లేదని విద్యుత్ అధికారిపై ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడిస్తున్నారని, గత రెండు రోజులుగా కరెంటు లేకపోవడం ఏమిటని.. అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కలుగొట్ల సొసైటీ చైర్మన్ గజేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేసిన వాటి బిల్లులు ఎందుకు చేయడం లేదని.. అమరవాయి ఎంపీటీసీ రోషన్న, కలుకుంట్ల సర్పంచ్ ఆత్మలింగారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు.
సర్పంచుల పాలన నాలుగేళ్లు కావస్తున్నా మేము అడిగిన సమస్యలకు మాత్రం పరిష్కారం దక్కడం లేదని ఆత్మలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనిచేయాలనుకున్నారా... లేదా సూటిగా చెప్పాలని కూడా నిలదీశారు. వారబంది ప్రకటించి సాగునీరును విడుదల చేయాలని.. మిరప పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని మండల ఉపాధ్యక్షుడు సోమన్న ఆర్డీఎస్ అధికారిని నిలదీశారు.