ఉమ్మడి పాలమూరు వాసులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుండే ‘పాలమూరు TO విశాఖ’’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ అందాలు.. చూడాలంటే ఉమ్మడి పాలమూరు జనానికి వ్యయ

Update: 2023-05-20 05:10 GMT

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ అందాలు.. చూడాలంటే ఉమ్మడి పాలమూరు జనానికి వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారంగా ఉండేది. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలు లేదా బస్సుకు వెళ్లేవారు. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. జిల్లా ప్రజల నుంచి విజ్ఙప్తులు విన్న ప్రభుత్వాలు స్పందించాయి. విశాఖపట్నం -కాచిగూడ మధ్య నడిచే విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక నుంచి మహబూబ్ నగర్ వరకు నడిపించనున్నారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం:

విశాఖ 12861, 12862 రైళ్ల రాకపోకల వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు సులభంగా రాకపోకలు సాగించుకోవడానికి అవకాశాలు మెరుగుపడి ఉన్నాయి. మహబూబ్ మెదక్ జిల్లా ప్రజలు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాయలపాడు (విజయవాడ), ఏటూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు అవకాశాలు కలగని ఉన్నాయి. ఈ అవకాశాలతో పాటు ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞాన విహారయాత్రలు చేసుకోవడానికి అవకాశాలు మరింత మెరుగుపడునున్నాయి.

రాకపోకలు:

ప్రతిరోజు సాయంత్రం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రైలు నాలుగు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది. స్టాప్ ఉన్న ప్రతి కేంద్రంలోనూ ఒక నిమిషం మాత్రమే నిలిచి ఆ తర్వాత బయలుదేరుతుంది. ముఖ్యమైన స్టేజీల వద్ద పది నిమిషాల వరకు ఆగుతుంది. మరుసటి రోజు ఉదయము 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. చార్జీలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే నిర్ణయించారు.

నేడు ఆరంభం..

పాలమూరు-విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొననున్నారు.




Tags:    

Similar News