44వ జాతీయ రహదారిపై బోల్తా పడ్డ మద్యం లారీ.. మద్యం సీసాల కోసం ఎగబడిన జనం

జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ వద్ద గల జంజం హోటల్ వద్ద 44వ జాతీయ రహదారిపై మద్యం లోడుతో ఆగి ఉన్న కంటైనర్ను మరో లారీ ఢీకొట్టింది.

Update: 2024-10-23 17:03 GMT

దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ వద్ద గల జంజం హోటల్ వద్ద 44వ జాతీయ రహదారిపై మద్యం లోడుతో ఆగి ఉన్న కంటైనర్ను మరో లారీ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ లో ఉన్న లిక్కర్ మద్యం చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా 44వ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళితే.. పెబ్బేరు నుండి హైదరాబాద్ మధ్యలో కంటైనర్ బయలుదేరింది. మార్గం మధ్యలో జడ్చర్ల పట్టణంలోని జంజం హోటల్ వద్ద జాతీయ రహదారి కంటైనర్ ఆగింది. ఇదే క్రమంలో వెనుక నుండి వస్తున్న మరో లారీ వేగంగా కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఆగి ఉన్న కంటైనర్ ముందుకెళ్లి మరో కంటైనర్ ఢీకొని రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మద్యం బాటిల్ చెల్లాచెదురు అవ్వగా లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే మద్యం బాటిల్లు రోడ్డుమీద పడిపోవడం గమనించిన స్థానికులు మద్యం బాటిల్లు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మద్యం బాటిల్లు తీసుకుంటున్న వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కంటైనర్లను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించే పనులు చేపట్టారు.


Similar News