డయేరియా మరణాలను నివారిద్దాం : కలెక్టర్

ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల డయేరియా మరణాలను నివారించడానికి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పిలుపు ఇచ్చారు

Update: 2024-07-02 14:47 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల డయేరియా మరణాలను నివారించడానికి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పిలుపు ఇచ్చారు. మంగళవారం ఆమె స్థానిక రామయ్యబౌలి అర్భన్ హెల్త్ సెంటర్ లో డయేరియా మరణాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 'స్టాప్ డయేరియా' కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రాథమిక,అర్భన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 5 సంవత్సరాల పిల్లల గృహాలను ఏఎన్ఏం,ఆశా వర్కర్లు గుర్తించి ఆ గృహంలో ఒక్కరికీ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ చొప్పున అందజేసి,ఏ విధంగా వాడాలో అవగాహన కల్పించి ప్యాకేట్లను అందజేస్తారని,అదే విధంగా గర్భిణీ స్త్రీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్,జింక్ ద్రావకాన్ని ఎలా వాడాలో అవగాహన కల్పిస్తారని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ,జిల్లా ఇమ్యూనైషన్ శాఖ అధికారి డా.శంకర్ బిలకంటి, డా.శ్రీధర్ రెడ్డి,డా.శశికాంత్, మలేరియా అధికారి డా.భాస్కర్ నాయక్, డా.జరినాభాను,డా.గౌతమి, వార్డు కౌన్సిలర్ రషిద్ ముస్తాక్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆమె పట్టణంలోని శిల్పారామం,ట్యాంకు బండ్ లను సందర్శించారు.వాటి పనుల పురోగతిని గురించి సంబంధిత అధికారులు ఆమెకు వివరించారు.అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.

Similar News