జడ్చర్ల నూతన మున్సిపల్ చైర్మన్ గా కోనేటి పుష్పలత ఏకగ్రీవ ఎన్నిక..
జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మున్సిపల్ చైర్మన్ దొరేపల్లి లక్ష్మి పై సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గారు. దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు. దీంతో నూతన చైర్మన్ కొరకు ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి సోమవారం ఎన్నికకు తేదీ ఖరారు చేశారు. ఒకరోజు ముందు క్యాంపునకు తరలిన బీఆర్ఎస్ 18 మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో సమావేశమై అందరితో ఏకాభిప్రాయం కుదిరించారు.
14వ వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలతను ఎన్నుకోవాల్సిందిగా లక్ష్మారెడ్డి సూచించడంతో మిగతా కౌన్సిలర్లు అందరూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు 14వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన ఉప ఎన్నికలో పాల్గొన్నారు. పుష్పలతకు వ్యతిరేకంగా ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్మన్గా కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కౌన్సిలర్లు హాజరైన వారి పాత్ర నామాత్రమే. అవిశ్వాసంలో పదవి కోల్పోయిన మాజీ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి చివర్లో చైర్మన్ ఎన్నికకు హాజరై నూతన చైర్మన్ ఉపఎన్నికకు హాజరై బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కోనేటి పుష్పలత చైర్మన్ గా ఎన్నికకు అనుకూలంగా వ్యవహరించారు. చైర్మన్ పదవి అధికార పార్టీ పరంకాకుండా బీఆర్ఎస్ కాపాడుకోగలిగింది.