ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హైదరాబాద్,మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం

Update: 2023-02-10 16:30 GMT

దిశ,వనపర్తి : హైదరాబాద్,మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు వార్తాపత్రికలు,మాధ్యమాలలో ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధాన ప్రకటనలు, కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను నిలిపివేయాలని సూచించారు.

ఎన్నికల సమయంలో పక్షపాతం కోసం అధికారిక మాస్ మీడియాను దుర్వినియోగం చేయరాదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ హెచ్చరించారు. రాజకీయ వార్తల కవరేజీ మరియు అధికారంలో ఉన్న పార్టీ అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విజయాలకు సంబంధించిన ప్రచారం,ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టెలికాస్ట్/ప్రసారం కోసం ఏదైనా ప్రకటన ఇప్పటికే విడుదల చేయబడి ఉంటే, అది తక్షణమేనిలిపివేయాలన్నారు. ఫిబ్రవరి 9 వ తేదీ నుండి అలాంటి ప్రకటనలు ఏ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు మొదలైన వాటిలో ప్రచురించకూడదన్నారు.ప్రింట్ మీడియాలో ఒకవేళ ఇప్పటికే ఇవ్వబడిన ప్రకటనలు ఉంటే వెంటనే ఉపసంహరించుకోవాలనన్నారు.

Tags:    

Similar News