రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే..

మొండి పట్టుదల,ద్వేషాలు,కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని,వివిధ కోర్టులలోని అనేక కేసుల్లో ఇరు వర్గాలు రాజీపడి పరిష్కరించుకుంటే ఇద్దరు గెలిచినట్లేనని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

Update: 2024-12-12 11:23 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మొండి పట్టుదల,ద్వేషాలు,కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని,వివిధ కోర్టులలోని అనేక కేసుల్లో ఇరు వర్గాలు రాజీపడి పరిష్కరించుకుంటే ఇద్దరు గెలిచినట్లేనని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని,కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బును వృథా చేసుకోవద్దని ఆమె సూచించారు. రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా,ఆస్తి విభజన,కుటుంబ పరమైన నిర్వాహణ,వైవాహిక జీవితానికి సంబంధించి కేసులు,అలాగే బ్యాంకు రికవరీ,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ లాంటి అనేక కేసులతో సహా కక్షిదారులు రాజీపడి పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్స్,సిబ్బంది కలిసి,రాజీ పడే కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. ఈ నెల 14 న మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో నిర్వహించే 'జాతీయ లోక్ అదాలత్' లో రాజీ పడి పరిష్కరించుకుంటే సత్వర న్యాయం జరుగుతుందని,అది రాజ మార్గం లాంటిదేనని ఎస్పీ పేర్కోన్నారు.


Similar News