కానిస్టేబుల్ రాత పరీక్షకు భారీ భద్రత: ఎస్పీ నరసింహ

జిల్లాలో ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలకు భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.

Update: 2023-04-27 16:10 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలకు భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు జరిగే కానిస్టేబుళ్ల పరీక్షలకు 14.388 అభ్యర్థులు హాజరవుతారని, అందుకు జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇందుకు గాను 1 అడిషనల్ ఎస్పీ, 3 గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 200 మంది హెడ్ కానిస్టేబుళ్లు/కానిస్టేబుళ్లతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వివరించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగా వచ్చి సందర్శించాలని, పరీక్షకు రెండు గంటల ముందుగా చేరుకోవాలని, పూర్తిగా సోదాలు చేశాక, గంట ముదు హాల్ లోకి అనుమతిస్తామని, తమ హాల్ టికెట్, పాస్ ఫోర్ట్ సైజ్ ఫోటో, ఏదైనా గుర్తింపు కార్డులను తప్పని సరిగా తీసుకురావాలని ఆయన సూచించారు.

ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, అభ్యర్థులు బ్లాక్ లేక బ్లూ బాల్ పెన్నును తెచ్చుకోవాలని ఎస్పీ వివరించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జీరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ సెంటర్స్ పరీక్ష ముగిసే వరకు మూసి ఉంచాలని, ప్రధానంగా ఇన్వీజిలేటర్స్, చీఫ్ సూపరెండెంట్, ఇతర సిబ్బంది ఎవరినీ కూడా పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆయన కరాఖండిగా తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జామ్ నోడల్ అధికారి, అడిషనల్ ఎస్పీ రాములు, రీజినల్ కో-ఆర్డినేటర్, జెపీఎన్సీ కాలేజీ ప్రిన్సిపల్ డా.సంజీవ్ కుమార్ ఆగిర్, ఎగ్జామ్ చీఫ్ సూపరెండెంట్స్, అబ్జర్వర్స్ పాల్గొన్నారు.

Tags:    

Similar News