వాహనాల తనిఖీల్లో భారీగా నగదు సీజ్
నారాయణ పేట జిల్లా చెక్ పోస్ట్ మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ కోట చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి రూ. 8, 40,౦౦౦ నగదును సీజ్ చేశారు.
దిశ, మక్తల్ : నారాయణ పేట జిల్లా చెక్ పోస్ట్ మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ కోట చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి రూ. 8, 40,౦౦౦ నగదును సీజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అంతర్ జిల్లా నారాయణ పేట మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ కోట క్రాసింగ్ వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కింగురి బీరప్ప దేవరకద్ర నుండి మక్తల్ మండలం జక్రేర్ గ్రామానికి కార్లు వెళ్తుండగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నగదును తరలిస్తుడంటంతో సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీ ముందు ప్రవేశ పెట్టడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.