తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి: డీకే అరుణ
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలంలోని గ్రామాలలో గురువారం వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు.
దిశ, వడ్డేపల్లి: జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలంలోని గ్రామాలలో గురువారం వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు పొలాల దగ్గర పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆత్మీయ సమ్మేళనాల మీద ఉన్న దృష్టి రాష్ట్రంలో ఉన్న రైతుల మీద లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదు. ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే పంట నష్టం జరిగిన రైతులకు ఈ రోజు పరిహారం వచ్చేది అని అన్నారు. రైతుల అప్పుల బాధలు భరించలేక వడ్డీ కట్టలేక రైతులు తమ ధాన్యాన్ని తక్కువ దొరికే అమ్ముకుని అప్పుల పాలవుతున్నారని చెప్పారు. పదివేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.