మత్స్యకారులకు ప్రభుత్వం అండ

మత్స్యకారుల కుటుంబాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

Update: 2024-11-07 11:45 GMT

దిశ, మక్తల్ : మత్స్యకారుల కుటుంబాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని బూత్పూర్ సంగంబండ రిజర్వాయర్​లో చేపలు వదిలి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మత్స్యకారులను స్వయం సమృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయి సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స శాఖ అధ్యక్షుడు కాంత్, మాజీ అధ్యక్షుడు కోళ్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ కట్ట సురేష్, తిప్పన్నా వెంకటేష్, తాయప్ప లింగమయ్య, మత్స్య సహకార సంఘం సభ్యులు నాగప్ప పాల్గొన్నారు. 


Similar News