మల్దకల్ జాతర టెంకాయల వేలంపాటలో గోల్ మాల్

మల్దకల్ తిమ్మప్ప జాతర గద్వాల్ నియోజకవర్గం నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

Update: 2024-12-16 03:52 GMT

దిశ, గద్వాల: మల్దకల్ తిమ్మప్ప జాతర గద్వాల్ నియోజకవర్గం నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తిమ్మప్ప స్వామికి తమ మొక్కులు తీర్చుకున్న అనంతరం, నగదు, వస్తు రూపేనా కానుకలు సమర్పించుకుంటున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు ఇదే అదునుగా భావించిన కొందరు ఆర్థికంగా తమ ఎదుగుదలనే ధ్యేయంగా భావించి మల్దకల్ తిమ్మప్ప స్వామి పేరిట పేరును పెట్టి ఎలాంటి ఆక్షేపణలు లేకుండా పలువురిని నియంత్రించి ప్రస్తుతం జరుగుతున్న, ఈ జాతరకు సుమారు రూ.కోటి ఆర్థిక జనార్జన ధ్యేయంగా అందరిని తనకణ కనుసన్నల్లో నడిపిస్తున్నాడు ఆ మల్దకల్ తిమ్మప్ప స్వామి అనువంశికుడు.

టెంకాయల వేలం పాట ఇలా..

గద్వాల నియోజకవర్గంలో దాదాపు 100కు పైగా గ్రామాలున్నాయి. మల్దకల్ తిమ్మప్పను ప్రతి ఒక్కరూ కూడా కొంగుబంగారంగా కొలుస్తారు. అయితే మల్లకల్ తిమ్మప్ప జాతర సందర్భం గా జాతరలో ప్రముఖంగా దేవునికి అర్పించే వాటిలో ప్రముఖంగా ఉన్నది టెంకాయలు వీటిని ఆసరాగా చేసుకుని కొందరు ధనార్జనే దయంగా పావులు కదుపుతూ దేవాలయ పూర్వీకులంటూ జాతరలో భక్తులకు టోకరా వేస్తున్నారు. దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులను తన ఆధీనంలో నడిపించేలా వ్యవహారం నడిపిస్తూ, ఆలయ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ తన అభివృద్ధిని కొంతమందితో కలిసి ప్రతి సంవత్సరం భక్తులను మోసం చేస్తున్నారని భక్తులు దుయ్యబడుతున్నారు.

మండిపడుతున్న భక్తులు

మల్లకల్ తిమ్మప్ప జాతరకు గద్వాల నియోజకవర్గ కాకుండా పరిసర ప్రాంతాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా సుమారు ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా తిమ్మప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది అక్రమార్జనకు పాల్పడుతున్న వారు స్వామికి సమర్పించే టెంకాయల విషయంలో రెండు టెంకాయలకు గాను 120 రూపాయలు వసూలు చేస్తున్న విషయం భక్తులకు ఆశ్చర్యం కల్పిస్తుంది కర్ణాటక నుంచి జములమ్మ దేవస్థానానికి కూడా భక్తులు వస్తారు కానీ 50 నుంచి 80 రూపాయల లోపే ఒక జత టెంకాయలు విక్రయిస్తారు కానీ మల్లకల్ తిమ్మప్ప జాతరలో జోడు టెంకాయలను 120 రూపాయలకు విక్రయించడం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు గాని దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు గాని అధిక వ్యయమే అంటున్నారు అంతర్రాష్ట్ర భక్తులు

టెంకాయ వేలంపాటలో అధికారుల పాత్ర..

టెంకాయల వేలం పాట వ్యవహారంలో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ప్రస్తుతం పనిచేస్తున్న చైర్మన్‌తో పాటు పలువురి హస్తం ఉన్నట్లు మల్దకల్ మండల ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి దిశ రిపోర్టర్ సంప్రదించగా సంబంధిత ఆలయ ఈవో స్పందించక పోవడం పలు అనుమానాలు తావిస్తోంది.


Similar News