Collector Vijayendra Boi : ప్రజావాణి ఫిర్యాదులపై సమగ్ర నివేదిక ఇవ్వండి

ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలని,

Update: 2024-08-19 14:45 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలని,ఇంతవరకు ఎన్ని పరిష్కరించారు,ఎన్ని పెండింగ్ లో ఉన్నవి,వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.నేటి ఫిర్యాదులలో సుమారు 38 మంది పిర్యాదులు సమర్పించారని,ప్రధానంగా భూములకు సంబంధించిన అంశాలు,పెన్షన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపారు.

అనంతరం ఆమె ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షిస్తూ భూములకు సంబంధించిన విషయాల పై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున తహసిల్దారులు ప్రత్యేకించి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే పిటిషన్ల పై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,డిఆర్ఓ కెవివి రవికుమార్,డిఆర్డిఓ నరసింహులు,తదితర జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Similar News