Cyber crimes : రైతులు సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి.. సీఐ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, పిక్చర్ బ్యాంకు లోగోతో వాట్సప్ లో ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తకోట వలయాధికారి ఎం.రాంబాబు కోరారు.
దిశ, కొత్తకోట : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, పిక్చర్ బ్యాంకు లోగోతో వాట్సప్ లో ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తకోట వలయాధికారి ఎం.రాంబాబు కోరారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను మనము యాక్సెప్ట్ చేస్తే మన వాట్సాప్ వారి కంట్రోల్ కీ వెళ్లి పోతుంది.
అంతే కాకుండా మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళ్తున్నది. దీని ద్వారా సైబర్ నేరస్థులు గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ ద్వారా డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. అందుకే ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదన్నారు. మీ వాట్సాప్ పనిచేయకుంటే వెంటనే రీ ఇన్స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్ లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరస్థుల చేతిలో బాదితులైతే వెంటనే #1930 కీ కాల్ చెయ్యాలని లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చెయ్యాలని సీఐ రాంబాబు రైతులను కోరారు.