ఎస్బిఐ బ్యాంక్ ముందు రైతుల నిరసన

పానగల్ మండలం కేతేపల్లి ఎస్బిఐ బ్రాంచ్ ముందు రైతులు నిరసన తెలిపారు.

Update: 2024-10-02 12:07 GMT

దిశ, వీపనగండ్ల: పానగల్ మండలం కేతేపల్లి ఎస్బిఐ బ్రాంచ్ ముందు రైతులు నిరసన తెలిపారు. పంట రుణాలు ఇవ్వకపోవడం పై సిపిఐ ఆధ్వర్యంలో బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, బ్యాంకుకు తగిన సిబ్బందిని కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ మాట్లాడారు. కేతేపల్లి లో బ్యాంకు శాఖను ఏర్పాటు చేసి సుమారు పదేళ్లు అవుతోందన్నారు. కేతేపల్లి తో పాటు చుట్టు గ్రామాల రైతులు ప్రజలు కేతేపల్లి ఎస్బిఐలో ఖాతాలు తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కానీ బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వటం లేదన్నారు. బ్యాంకు అధికారులను కలిసి రుణాలు ఇవ్వాలని రాతపూర్వకంగా అడిగిన సిబ్బంది కొరత ఉందని, ఇవ్వలేమని చెబుతూ వస్తున్నారని వాపోయారు. వ్యవసాయ రుణాలు ఇవ్వని కేతేపల్లి ఎస్బిఐ అధికారులు బంగారు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తున్నారన్నారు. బంగారు రుణాలు ఇచ్చేందుకు సిబ్బంది ఉన్నప్పుడు వ్యవసాయ రుణాలకు ఎందుకు సిబ్బంది లేరని ప్రశ్నించారు. కేతేపల్లి ఎస్బిఐలో ఖాతాలు ఉన్న రైతులు ప్రజలు పెంట్లవెల్లి ఆంధ్ర బ్యాంక్, పానగల్ ఎస్బిఐ, వనపర్తి బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చు కోవాల్సి వస్తుందన్నారు.


Similar News