ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల 47 లక్షల బిల్లు వేసిన విద్యుత్ సిబ్బంది..!
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తుంది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్‌లో మండలంలో ఓ ఇంటి యజమానికి కరెంట్ బిల్ చూసి గుండె ఆగినంత పనైంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన వేమారెడ్డికి ప్రతి మంత్ వందల రూపాయల బిల్లు వచ్చేది. కానీ ఈ నెల విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ స్కాన్ చేసి రూ. 21, 47, 569 కట్టాలని బిల్లు ఇచ్చారు. దీంతో వేమారెడ్డి షాక్ తిన్నాడు. వెంటనే అధికారులను ఆశ్రయించాడు. లైన్‌మెన్, జూనియర్ లైన్ మెన్ లు అవగాహన లేని వ్యక్తులతో కరెంటు బిల్లులు ఇస్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేటు వ్యక్తులే చేయడంతో వారికి సరిగా అవగాహన లేకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని సమాచారం.