District Collectorn : మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తా

ప్రభుత్వ జేఎన్ టియు ఇంజనీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పించేందు తన వంతు కృషి చేస్తానని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

Update: 2024-10-30 13:04 GMT

దిశ,వనపర్తి : ప్రభుత్వ జేఎన్ టియు ఇంజనీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పించేందు తన వంతు కృషి చేస్తానని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జే ఎన్.టి.యు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వేంకటేశ్వర రెడ్డి తో..కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వి.ఎస్.రాజు,వైస్ ప్రిన్సిపాల్ రామ్ నరేష్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లాలో 2022 లో ప్రారంభమైన జె.ఎన్.టి యు ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి వంద కోట్లు పరిపాలన ఉత్తర్వులు మంజూరు అయినప్పటికి.. నిధులు ఇంకా విడుదల కాలేదని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు.


Similar News