నీటి చుక్కలు పడేది వాస్తవమే..ఎలాంటి ప్రమాదం లేదు
గత వారం రోజుల నుంచి తెలంగాణ శ్రీశైల నడప గట్టు హైడల్ విద్యుత్ సొరంగ కేంద్రంలో డ్యాం దిగువన ఉన్న జీరో స్లాబ్ ఏరియాలో వాటర్ లీకేజీ అవుతున్న విషయం కలకలం రేపుతుంది.
దిశ, అచ్చంపేట : గత వారం రోజుల నుంచి తెలంగాణ శ్రీశైల నడప గట్టు హైడల్ విద్యుత్ సొరంగ కేంద్రంలో డ్యాం దిగువన ఉన్న జీరో స్లాబ్ ఏరియాలో వాటర్ లీకేజీ అవుతున్న విషయం కలకలం రేపుతుంది. ఇదే విషయం మరోసారి సామాజిక మాధ్యమాలలో బుధవారం వైరల్ అవుతుండడంతో...ఆ విషయంపై దిశ పూర్తిస్థాయిలో తెలుసుకొని అసలు విషయాలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ సమాజానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నది.
ఏం జరిగిందంటే...
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ విద్యుత్ కేంద్రంలో పవర్ హౌస్ దిగువ బాగానే ఉన్నా..జీరో ప్లాంట్ డ్రాప్టింగ్ మ్యాన్ హోల్ గదిలో ఒక నీటి హౌస్ ఉంటుందని, చిన్న చిన్న నీటి చుక్కలు చాలా సందర్భాలలో సహజంగానే పడుతుంటాయి. ఈ విషయం తెలియని వ్యక్తులు ఎవరో కానీ..శ్రీశైలం ఏడవగట్టు సొరంగ కేంద్రం దిగువన వాటర్ లీకేజ్ అవుతూ విద్యుత్ ప్లాంట్ లోకి నీరు వచ్చి చేరుతుందని అసత్య ప్రచారం జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. ఈ చిన్న విషయాన్ని ఎవరు భూతద్దంలో పెట్టి చూశారో కానీ.. శ్రీశైలం తెలంగాణ ఎడమ గట్టు విద్యుత్ సొరంగ పవర్ హౌస్ లో వాటర్ లీకేజ్ తో మరోసారి ప్రమాదంలో పడిందని తప్పుడు ప్రచారం అతివేగంగా వ్యాప్తి చెందింది. సామాజిక మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతున్న విషయం చూసినవారు అవాక్కయ్యారు.
నీటి చుక్కలు పడేది వాస్తవమే.. ఎలాంటి ప్రమాదం లేదు..నీటి చుక్కలు పడేది వాస్తవమే.. ఎలాంటి ప్రమాదం లేదు.
ఈ విషయంపై టెక్నికల్ సిఈ కార్యాలయం శ్రీధర్ ని వివరణ కోరగా..ఆయన దిశతో మాట్లాడారు. చిన్నచిన్న నీటి చుక్కలు లీకేజీ నిజమేనని, చాలా సందర్భాలలో అది జరుగుతూనే ఉంటుందన్నారు. అంతమాత్రాన విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ప్రమాదము లేదని, ఆయన జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. నిరంతరాయంగా అన్ని షిఫ్టులు పనిచేస్తున్నాయన్నారు. ఈ విషయంపై సంబంధిత ప్రాజెక్టు ఉన్నత అధికార నిపుణులకు సమాచారం అందజేశామని, ఒకటి రెండు రోజులలో సంబంధిత నిపుణులు పరిశీలిస్తారని గుర్తు చేశారు. అలాగే ఎవరు అసత్య ప్రచారం చేశారు అనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు.