కృష్ణా నది గుర్తు తో జిల్లా పోలీస్ లోగో…
నారాయణపేట జిల్లా పోలీస్ యూనిట్ లోగో ను ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు
దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా పోలీస్ యూనిట్ లోగో ను ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోగోలో సురక్ష అహర్నిశం అంటే రాత్రి పగలు శాంతి భద్రతలను కాపాడటం అనే సందేశాన్ని ఇస్తుందని అలాగే ఆలివ్ కొమ్మ శాంతికి చిహ్నంగా చూపిస్తుందన్నారు. అలాగే 12 స్టార్ లను జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్లు గా అభివర్ణించారు. కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో మొదటగా కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో తంగిడి గ్రామం వద్ద కలుస్తున్నందున కృష్ణ బిడ్జ్, కృష్ణానదిని సూచిస్తూ లోగో ను ఏర్పాటు రూపొందించామన్నారు. అలాగే జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా నిర్వహించే పెండింగ్ కేసుల పురోగతిపై మాట్లాడారు.