గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ - కబడ్డీ పోటీలు..

మండల కేంద్రం వీపనగండ్లలో దీపావళి పండుగ గంగమ్మ జాతరను పురస్కరించుకొని అక్టోబర్ 26వ తేదీ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రికెట్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Update: 2024-10-24 06:05 GMT

దిశ, వీపనగండ్ల : మండల కేంద్రం వీపనగండ్లలో దీపావళి పండుగ గంగమ్మ జాతరను పురస్కరించుకొని అక్టోబర్ 26వ తేదీ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రికెట్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ధారాసింగ్, బీఆర్ఎస్ మండల నాయకులు రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షులు ముంత మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ మండల యువ నాయకులు ముంతా శివ యాదవ్, టీచర్ జొల్లు గంగన్న సహకారంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రత్నగిరి క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారన్నారు.

అలాగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నవంబర్ 1వ తేదీ నుంచి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ పోటీలో పాల్గొనే టీంలు 25 వ తేదీ సాయంత్రంలోగా ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించి పేర్లను నమోదు చేయించుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జి.రాము, మీసాల నాగరాజు తెలిపారు. కబడ్డీ పోటీల్లో పాల్గొనే టీమ్లు 31వ తేదీ సాయంత్రంలోగా 500 రూపాయలు ఎంట్రీ ఫీట్ చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలని కబడి నిర్వాహకులు క్రాంతికుమార్, శివ యాదవ్, మహేష్ యాదవులు తెలిపారు. క్రికెట్ పోటీలో పాల్గొనే వారు 94932 07060, 8985191437, 8179773825, 7095064638 నెంబర్లను, కబడ్డీ పోటీలో పాల్గొనే టీంలు 6300476059, 6304039959, 630069930 నెంబర్లను సంప్రదించి పేర్లను నమోదు చేయించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.


Similar News