ప్రభుత్వ బాలికల కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

Update: 2023-03-15 11:02 GMT

దిశ, గద్వాల: ఇంటర్మీడియట్ బాలికల ప్రభుత్వ కళాశాల భవనం మిగిలిపోయిన పనులను మార్చి చివరి వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ప్రభుత్వ బాలికల కళాశాల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రూమ్‌లు అన్నింటిని తిరిగి పరిశీలించారు. కోట గోడకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల భవనానికి దగ్గరలో ఉన్న కంప చెట్లను తొలగించి, మధ్యలో ఉన్న స్థలంలో గ్రీనరీ ఏర్పాటు చేసి.. మొక్కలు నాటాలన్నారు. టాయిలెట్స్‌కు డోర్లు ఏర్పాటు చేసి పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనులను పరిశీలించారు. కార్యాలయం మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సముదాయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయ రాజ్, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, డి.ఈ కిరణ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News