దిశ ఎఫెక్ట్…డబుల్, త్రిబుల్ కథనాల పై అధికారుల ఆరా..
గత రెండు రోజుల క్రితం డబుల్ త్రిబుల్ పేరుతో మహబూబ్‌నగర్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ వ్యవహారంలో జరిగిన అక్రమ వ్యవహారాల గుట్టును దిశ బట్టబయలు చేసింది.
దిశ, మహబూబ్ నగర్ : గత రెండు రోజుల క్రితం డబుల్ త్రిబుల్ పేరుతో మహబూబ్‌నగర్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ వ్యవహారంలో జరిగిన అక్రమ వ్యవహారాల గుట్టును దిశ బట్టబయలు చేసింది. దీంతో దిశ కథనాల ఆధారంగా పలు శాఖలు సదురు తహసీల్దారు,గతంలో పని చేసిన ఇద్దరు ఆర్,ఐ లు, ప్రస్తుతం ఉన్న ఆర్ ఐ తో పాటు గా మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పై అంతర్గత విచారణను సాగిస్తున్నారు.
విచారణలో భాగంగా డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ లు పొందిన వారిని నేరుగా కలిసి అధికారులు వివరాలు సేకరించారు. ఎవరేవరికి ఎప్పుడుఎప్పుడు ఎంతెంత ఇచ్చారు అన్న దానిపై క్షుణ్ణంగా అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో భాదితులు చేసిన ఫిర్యాదులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం సాగించిన విచారణపై కూడా ఉన్నత అధికారులు దృష్టి సారించినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.
దిశలో డబుల్ త్రిబుల్ పేరుతో వచ్చిన కథనం నిజమే
ఆదివారం నాడు డబుల్ త్రిబుల్ పేరుతో దిశలో వచ్చిన కథనం వాస్తవమేని అధికారులకు లావణ్య అనే భాదితురాలు వివరించింది. తను అర్హురాలు అయిన కూడా డబ్బులు ఇస్తే గాని డబుల్ బెడ్ రూమ్ పట్టా ఇవ్వమని తెగేసి చెప్పడంతో మొదటగా 3లక్షలు ఇచ్చి మోలాలి గుట్ట సమీపంలో ఇంటి పట్టా తీసుకున్నట్లు భాదితులు అదికారులకు తెలియ జేసింది. అక్కడ పూర్తి సౌకర్యాలు లేవని తిరస్కరించడంతో దివిటిపల్లిలో మరో ఇంటి నెంబర్ తో పట్టా ఇచ్చారని దానికి రెండు లక్షల యాబై వేల రూపాయలు తీసుకున్నారని తెలిపింది.
అప్పటికే ఆ ఇంటిని వేరే వారికి కేటాయించడంతో మరో మారు పది వేలు తీసుకుని ఇంకో పట్టా ఇచ్చారని భాదితురాలు వాపోయింది.మొత్తంగా తన వద్ద 5 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని దివిటిపల్లిలో ఇంటిని కేటాయించినట్లు అధికారుల వద్ద మొరపెట్టుకుంది. తాను ఒక వికలాంగురాలినని కూడ కనికరం లేకుండా డబ్బులు తీసుకున్నారని, భాదితురాలు లావణ్య అధికారుల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకు వచ్చింది.