తసిల్దారు కార్యాలయం ముందు వామపక్షల ధర్నా
మక్తల్ తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎఐయుకెఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
దిశ, మక్తల్: మక్తల్ తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎఐయుకెఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఐయుకెఎస్ ఏరియా కమిటీ అధ్యక్షులు ఆనంద అధ్యక్షత వహించగా..జిల్లా అధ్యక్షులు భగవంతు, పంచాదేవ్ పాడు రాజు.టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎ జిభూట్టో పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులకు అభివృద్ధి ఒరిగిందేమీ లేదని, పెట్టుబడిదారులకే న్యాయం చేస్తున్నారన్నారు. అందుకు ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ క్రింది తక్షణ బర్నింగ్ డిమాండ్లను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జనవరి 9, ఆల్ ఇండియా డిమాండ్ డే గా జరపాలని పలువురు అన్నారు. సాగు భూములకు రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని, రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర ఖర్చుల మీద 50% మదనంగా కలిపి (C2 ప్లస్ 50%)ఎంఎస్పి నిర్ణయించాలని తెలిపారు. ఎన్ఈజిఆర్ ఎలో 200 రోజుల పని , రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,భూమిలేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు,నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ లతో తహసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలోసీపీఐ(ఎంఎంల్) యస్ కిరణ్ కుమార్ అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు గోపాల్, ప్రసాద్, గడ్డం ఆంజనేయులు, ఆశప్ప, నక్క తాయప్ప , తదితరులు పాల్గొన్నారు.