గద్వాల్ లో కోర్టు భవనం నిర్మించండి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కోర్టు భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి,ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

Update: 2024-12-31 10:10 GMT

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కోర్టు భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి,ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రజలతోపాటు,బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు భవనం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. కోర్టు భవన నిర్మాణం కోసం మూడు చోట్ల స్థలాలను గుర్తించడం జరిగిందని,ఆ మూడు స్థలాలలో అనువైన చోట కోర్టు భవనం నిర్మించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.


Similar News