ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2k రన్ ను ప్రారంభం..

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఎక్స్ రోడ్ నుండి 2కె రన్ నిర్వహించారు.

Update: 2024-12-03 07:59 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఎక్స్ రోడ్ నుండి 2కె రన్ నిర్వహించారు. 2K రన్ ను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తార, ఇందులో భాగంగా ఈరోజు అర్బన్ - డేను పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2k రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆహార భత్యం (డైట్ చార్జీలు) పెంచినట్లు తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలలో ఇక ముందు నాణ్యమైన సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య కార్మికులకు, మెప్మా, స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మున్సిపల్ సిబ్బందికి వైద్యచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, డీవైఎస్ఓ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Similar News