ఛత్రపతి శివాజీ అందరికీ ఆదర్శం - డీకే అరుణ
ఛత్రపతి శివాజీ అంటేనే ఒక ధైర్యం. ఇప్పటికి కూడా అయన స్ఫూర్తి ధైర్య సాహసాలు అందరికీ ఆదర్శం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
దిశ,అలంపూర్ టౌన్: ఛత్రపతి శివాజీ అంటేనే ఒక ధైర్యం. ఇప్పటికి కూడా అయన స్ఫూర్తి ధైర్య సాహసాలు అందరికీ ఆదర్శం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం వారి ఆధ్వర్యంలో శివాజి పట్టాభిషేకం జరిగి నేటికి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా అలంపూర్ నుండి చత్రపతి శివాజీ మహారాజ్ రథయాత్రను ప్రారంభించారు. ఈ రథయాత్ర ప్రారంభానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బంగారు శృతి దేశం నలుమూలల నుంచి స్వామీజీలు సాధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ చత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన రథయాత్రను ఐదు శక్తి పీఠమైన జోగులాంబ ఆలయం నుండి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చత్రపతి శివాజీ అంటే ధైర్యం అని ఆయన పరాక్రమణ పోరాటాలు ,యుద్ధాలు,సిద్ధాంతాలు అందరికీ ఆదర్శం అన్నారు. హిందూ స్థాపన కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సుపరిపాలన అందించినటువంటి గొప్ప స్ఫూర్తి దాత అని అన్నారు. ఈ రథయాత్ర గద్వాల మక్తల్ మరికల్ మహబూబ్ నగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.