ఎల్కూర్ లో కార్డెన్ సెర్చ్..

జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ సృజన ఆదేశాల మేరకు ఆదివారం మల్దకల్ మండలం ఏల్కూరు గ్రామంలో గద్వాల్ సీఐ చంద్రశేఖర్, మల్దకల్ ఎస్ఐ ఆర్. శేఖర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాంను నిర్వహించారు.

Update: 2023-05-28 15:59 GMT

దిశ, మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ సృజన ఆదేశాల మేరకు ఆదివారం మల్దకల్ మండలం ఏల్కూరు గ్రామంలో గద్వాల్ సీఐ చంద్రశేఖర్, మల్దకల్ ఎస్ఐ ఆర్. శేఖర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాంను నిర్వహించారు. 30 మంది కానిస్టేబుళ్లు నలుగురు, హెడ్ కానిస్టేబుళ్లు ఐదు మంది, ఎస్ఐలు, సీఐ పాల్గొన్నారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి దాదాపు 200 ఇళ్లను చెక్ చేశారు. తనిఖీలో సరియైన వాహన పత్రాలు లేనటువంటి దాదాపు 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఒక రౌడీషీటర్ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్, చైల్డ్ లేబర్, రోడ్ సేఫ్టీ రూల్స్  గురించి వివరించారు. ఎవరైన తమ ఫోన్లను పోగొట్టుకున్నట్లయితే సీఈఆర్ఐ వెబ్ సైట్ లో అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని తెలియజేశారు. వేసవికాలంలో తమ పిల్లలను ఈతకు వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.

Tags:    

Similar News