కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తాము: DK Aruna

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్ బూత్ స్థాయి కమిటీ ల సమ్మేళనం గద్వాల పట్టణంలో శనివారం ప్రైవేట్ హాల్ లో ప్రారంభమయ్యాయి.

Update: 2023-01-07 08:34 GMT

దిశ, గద్వాల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్ బూత్ స్థాయి కమిటీ ల సమ్మేళనం గద్వాల పట్టణంలో శనివారం ప్రైవేట్ హాల్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ ప్రసంగం లైవ్‌లో ఎర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతియ అద్యక్షుడు జెపి నడ్డ వర్చువల్‌గా ప్రసంగించారు.

అనంతరం డీకే అరుణ ప్రసంగిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలను మోసం చేస్తూ.. హామీలను నెరవేర్చకుండా తెలంగాణ పదం లేకుండా పార్టీ పేరు మార్చుకున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రధానిని విమర్శించే స్థాయి లేదని, కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు అప్పులు తెచ్చి వేల కోట్లు అక్రమంగా కేసీఆర్ కుటుంబం వెనుకేసుకొందని ద్వజమెత్తారు. లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద మోపి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను, రైతులను, దళితులను మోసం చేశారని అన్నారు.

ఉచిత విద్యుత్ అంతా బూటకమని రైతులకు ఇచ్చే విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెంచి భారం మోపరని, రైతులకు ఇచ్చే రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5000 ఇస్తే అదే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఎకరాకు ఎరువుల సబ్సిడీ ద్వారా సుమారు 20,000 రూపాయల వరకు రైతులకు సబ్సిడీ ఇస్తున్నారన్నారు. నూతన విద్యా విధానం దేశం మొత్తం ఒకే రకమైన విద్య విధానం రాబోయే తరాలకు ఒక వరమని, ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన నేతగా ప్రధాని మోడీ కొనసాగుతున్నారని ఆమె కొనియాడారు. బూత్ కమిటీ సభ్యులు పార్టీ అభివృద్దిలో కీలకమని ,రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీ పార్టీనే అని అమే ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు తెలుపాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. బీజేపీ అధికారం లోకి వస్తే ఇప్పుడు ఉన్న ఏ స్కీం తొలగించమని, ఇంకా మెరుగైన పాలన చేస్తామని తెలిపారు.

తెలంగాణ దోచుకున్నది చాలదు అనీ దేశాన్ని దోచుకోవడానికి బీఆర్ఎస్ పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరడానికి విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న ధనాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పైసా కక్కిస్తమని అమే తెలిపారు. పాలమూరు నుంచి మోడీ పోటీ చేస్తే పాలమూరు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, బీజేపీ ఇంచార్జ్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణ రెడ్డి,జిల్లా కార్యదర్శి స్నిగ్ధ రెడ్డి, ఎక్‌బోటి రవి, అసెంబ్లీ ఇంచార్జీ రామాంజనేయులు , బి జె వై ఎం కార్యకర్తలు,బూత్ కమిటీ సభ్యులు , ఇతర విభాగం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News