అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచితుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు ఎల్లప్పుడూ పోలీసుల రక్షణగా ఉంటారని ఎస్సై కృష్ణంరాజు అన్నారు.

Update: 2025-01-09 11:09 GMT

దిశ, ఊట్కూర్ : అపరిచితుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు ఎల్లప్పుడూ పోలీసుల రక్షణగా ఉంటారని ఎస్సై కృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా..పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కృష్ణంరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి చదువు పై దృష్టి పెట్టాలని,సెల్ పోన్ ఉపయోగించడం వలన సమయం వృధా అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. మహిళలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులు పెట్టిన,భయభ్రాంతులకు గురిచేసిన 100 కు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని,విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు ఉందన్నారు. బాల్య వివాహలు, ర్యాగింగ్, పోక్స్, సైబర్ నేరల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Similar News