రూ,3 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటు
కొల్లాపూర్ లో త్వరలోనే రూ,3 కోట్లలతో ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు వెల్లడించారు.
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ లో త్వరలోనే రూ,3 కోట్లలతో ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు వెల్లడించారు. పట్టణంలో సంస్థానాల కాలంలో ఏర్పాటు చేసిన రాణీ ఇందిరాదేవి ప్రభుత్వ హై స్కూల్,జూనియర్ కళాశాల వారోత్సవాల సందర్భంగా.. స్థానిక మినీ స్టేడియంలో డివిజన్ స్థాయి ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులకు క్రీడా పోటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ..క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతిరోజు ఆటపాటలతో పాటు వ్యాయామం చేయాలని మంత్రి సూచించారు. దీంతో శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని ఇస్తుందన్నారు. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో క్రీడలతో పాటు..విద్య వంటపట్టెదని గత జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేశారు. క్రీడల మూలంగా విద్యార్థులలో స్నేహభావం కొనసాగుతుందని అన్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో కొల్లాపూర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొల్లాపూర్ రాజా బంధాలు జరగనున్నదని, ఈ సమ్మేళనానికి ఇక్కడ చదివి విద్యా , ఉద్యోగ,వ్యాపార రంగాలలో ఎదిగి దేశ, విదేశాల్లో స్థిరపడిన ఉన్న పూర్వ విద్యార్థులందరు హాజరుకాబోతున్నారని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ మూడు రోజులూ కొల్లాపూర్ లో ఉత్సవ వాతావరణం నెలకొంటుదని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు మంత్రి శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి మైదానాన్ని చుట్టారు. ఈ సందర్భంగా క్రీడాకారులు కవాత్తు చేస్తూ మంత్రి జూపల్లి కి వందనం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థినిలు పలు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి,ఎంతగానో ఆలరింప చేశారు. వజ్రోత్సవాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాయిప్రసాద్ (సైంటిస్ట్) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రిటైర్డ్ డిఆర్ఓ కటికనేని మదన్మోహన్ రావు, కవి రాందాస్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ దివాకర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు, ఎంఈఓ ఇమ్మానియేల్, పీజీ డిగ్రీ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్లు మార్క్ పోలేనియస్, ఉదయ్ కుమార్, రవి, వివిధ పాఠశాలలు కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.