అశేష జనవాహిని మధ్య బీజేపీ అభ్యర్థి శివారెడ్డి నామినేషన్

నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2023-11-10 12:28 GMT

దిశ, గద్వాల : నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ధరూర్ మెట్టు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అందజేసిన అనంతరం మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. గద్వాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది ఒక్క డీకే అరుణ మాత్రమే అన్నారు.

దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుంది అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం గద్వాల నడిగడ్డపై బీసీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లందరూ బీసీ అభ్యర్థి శివారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అభ్యర్థి శివారెడ్డి నాయకులు రామాంజనేయులు రజక జయశ్రీ పాల్గొన్నారు.

బీజేపీపార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బలిగేర వాల్మీకి బోయ శివారెడ్డి._

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో నోబుల్ స్కూల్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి డీకే అరుణతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వాల్మీకి బోయ బలిగేర శివారెడ్డి

Tags:    

Similar News