ఈ జిల్లాలో అంబులెన్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు..
మహబూబ్ నగర్ లో 108 ,102 అత్యవసర సేవల కోసం అంబులెన్స్ లో పనిచేయటానికి డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోఆర్డినేటర్ ఉదయకుమార్ తెలిపారు
దిశ, జడ్చర్ల : మహబూబ్ నగర్ లో 108 ,102 అత్యవసర సేవల కోసం అంబులెన్స్ లో పనిచేయటానికి డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోఆర్డినేటర్ ఉదయకుమార్ తెలిపారు. అభ్యర్థులు14-11-2024 గురువారం రోజు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను, ఆధార్ కార్డు అన్ని సర్టిఫికెట్లను ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలని కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. అర్హతలు పదవ తరగతి చదివి 35 సంవత్సరాల లోపు వయస్సు, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మూడు సంవత్సరాల అనుభవం బ్యాడ్జి నెంబర్ కలిగి ఉండాలి తెలిపారు. ఇందులో ఉద్యోగ అవకాశం పొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగాలు నిర్వహించాల్సి ఉంటుందని, ఇంటర్వ్యూ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుందన్నారు. మిగతా వివరాల కోసం 9100799527 ,9491271103 కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ ను సంప్రదించాలని కోరారు.