బీసీల రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేపట్టాలి: జూలూరి గౌరీశంకర్

కుల గణన చేస్తామని బీసీలను రాజకీయం కోసమే వాడుకుంటున్నారే తప్పా.. వారిని ఓటు వేసే యంత్రాలుగా మర్చేశారని, బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహా మరో ఉద్యమంతోనే సాధ్యమని తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు.

Update: 2024-07-15 07:27 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కుల గణన చేస్తామని బీసీలను రాజకీయం కోసమే వాడుకుంటున్నారే తప్పా.. వారిని ఓటు వేసే యంత్రాలుగా మర్చేశారని, బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహా మరో ఉద్యమంతోనే సాధ్యమని తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఆదివారం స్థానిక లుంబినీ పబ్లిక్ స్కూల్‌లో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య సంపాదకీయంలో 156 మంది కవుల రచనలతో రచించిన 'ధిక్కార' పుస్తకమును ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్థన్ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ ఉద్యేగంగా ప్రసంగించారు.

బీసీల ఆర్ధిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి, ఉత్పత్తి కులాలన్నింటినీ ఏకం చేసే పనిలో బీసీ కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులు ఒక్కటిగా కదలాలి ఆయన పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని విపీ సింగ్ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ముందుకు రాకుండా చేశారని ఆయన విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో బీసీలకు సీట్లు కేటాయించినప్పుడే సరియైన న్యాయం జరుగుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధం కాకపోతే, బీసీల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

బీసీల రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేపట్టాలి: జూలూరి గౌరీశంకర్సాంఘిక, సాంస్కృతిక, సమానత్వం కోసం పోరాడిన మహానీయుడు ఫూలే గురించి ఈ పుస్తకంలో కవులు గొప్పగా అభివర్ణించారని ఆయన కొనియాడారు. ప్రముఖ విద్యావేత్త, కవి లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆధునిక సామాజిక భారత నిర్మాత జ్యోతిరావు ఫూలే సమాజానికి అక్షరజ్ఞానాన్ని అందించి బాల్యం వివాహాలను నిర్మూలన చేసిన మహనీయుడని కొనియాడారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పుస్తక సమీక్ష చేస్తూ కవితా సంకలనంలోని కవులు రాసిన కవితలు ఫూలే వ్యక్తిత్వాన్ని, సామాజిక ఉద్యమ స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరించారని అన్నారు. ఈ సమావేశంలో డా.సంగిరెడ్డి శ్రీనివాస్, నాగారం బలరాం, వహీద్ ఖాన్, మోహన్, బోల యాదయ్య, కొప్పుల యాదయ్య, పుష్పాలత, జగపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News