మరిది లైంగిక వేధింపులు..అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపురం గ్రామంలో చోటు చేసుకుంది .

Update: 2024-11-12 15:05 GMT

దిశ ,నాగర్ కర్నూల్/బిజినపల్లి : అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి బాబాయి తెలిపిన వివరాల ప్రకారం ..నాగర్ కర్నూలు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన నాగయ్య,శాంతమ్మ దంపతుల కుమార్తె మణెమ్మ (31) ను బిజినపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన సుధాకర్ కు 13 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి భర్త సుధాకర్, అత్త వెంకటమ్మ,మరిది దశరథం తమ కుమార్తెతో తరచూ గొడవ పడుతూ ఉండేవారని తెలిపారు. మరిది దశరథం ,మణెమ్మ ను లైంగికంగా వేధిస్తుండేవాడు. ఈ విషయం తన భర్త సుధాకర్ కు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదన్నారు. దసరా పండక్కి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో భర్త సుధాకర్ ను, మరిది దశరథంను,అత్త వెంకటమ్మను పిలిచి..పెద్దమనుషుల సమక్షంలో నచ్చ చెప్పడం జరిగిందన్నారు. అనంతరం సుధాకర్ తన భార్య మణెమ్మను తీసుకొని ఖానాపురం స్వగ్రామానికి వెళ్ళాడు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తన భర్త సుధాకర్ కు బావ వరుస అయిన దొబ్బలి చిన్నయ్య తన చిన్న అల్లుడికి ఫోన్ చేసి..తమ కుమార్తె చనిపోయిందని తెలిపారు. దీంతో తాము నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లి చూడగా.. తమ కుమార్తె మణెమ్మ చనిపోయి ఉందన్నారు. తమ కూతురు మృతికి భర్త సుధాకర్, మరిది దశరథం, అత్త వెంకటమ్మ కారణమని మంగళవారం నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.


Similar News