విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుః కలెక్టర్ సిక్తా పట్నాయక్

Update: 2024-08-28 12:07 GMT

దిశ, మద్దూరు, కొత్తపల్లి: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిరక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని మద్దూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. విధులు నిర్వహించే డాక్టర్లు, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎంలు ఎంతమంది ఉన్నారని, వారు ఎన్ని, రోజులు ? ఏ ఏ సమయాలలో విధులు నిర్వహిస్తున్నారని అక్కడి వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆసుపత్రికి వచ్చిన మంగమ్మ అనే మహిళ మందులు ఇక్కడ ఇవ్వకుండా బయటకి రాస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, స్పందించిన కలెక్టర్ ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ముందుగానే అవసరమైన మందుల ఇండెంట్ ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు. మద్దూర్ ఉపాధి హామీ కార్యాలయంలో ఉదయం 11 గంటలు దాటినా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని మరో యువకుడు తన సెల్ ఫోన్ లో తీసిన చిత్రాలతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పై ఫిర్యాదులన్నిటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.


Similar News