మనిషిలాగే తల, కాళ్లు, నోరు.. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వింత కీటకం

ప్రకృతిలో.. ఎన్నో వింతలు విశేషాలు.. వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.

Update: 2023-05-17 05:30 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రకృతిలో.. ఎన్నో వింతలు విశేషాలు.. వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇటువంటి వింతే గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. హలీం పాషా అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాన్ని తలపింపజేసేలా ఉన్న కీటకాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆ కీటకానికి మనిషికి ఉన్నట్లుగా ముక్కు, నోరు, తల భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని కొంతమంది ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News