అరుదైన స్వైన్ ఫ్లూ కేసు నమోదు

మక్తల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలో అరుదైన స్వైన్ ఫ్లూ కేసు నమోదు అయింది.

Update: 2024-11-06 15:41 GMT

దిశ,మక్తల్: మక్తల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలో అరుదైన స్వైన్ ఫ్లూ కేసు నమోదు అయింది. అయనతో పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో ముగ్గురు వ్యక్తులకు వ్యాధి లక్షణాలు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షలు తేలిందని సమాచారం.గత నాలుగు రోజుల కింద స్వైన్ ఫ్లూ రోగికి వ్యాధి లక్షణాలు బయటపడగా.. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని,మూడు రోజుల్లో ఆయన కొలుకోని డిశ్చార్జ్ అవుతున్నట్టుగా సమాచారం.ఈ విషయంపై జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాఘవేందర్ రెడ్డిని వివరణ కోరగా..స్వైన్ ఫ్లూ కేసు నమోదైన విషయం నిజమేనని తెలిపారు. తమ ఆ ఏరియాలో నివసిస్తున్న కొంతమందిని పరీక్షించగా..అందులో ముగ్గురు వ్యక్తులకు ఈ లక్షణాలు ఉన్నట్లుగా సమాచారం, చికిత్స చేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు ఆందోళన పడనవసరం లేదని దీనికి నివారణ మందులు అందుబాటులో ఉన్నాయని,ఎవరైన జ్వరం,జలుబు ,ఒళ్ళు నొప్పులతో ఉన్న వ్యక్తులు వైద్య పరీక్షలు చేసుకుని మందులు వాడితే తగ్గిపోతుందని ఆయన తెలిపారు.


Similar News