Nallamala : నల్లమల ఒడిలో అద్భుత ద్వీపం

దేశంలోనే ఎంతో పేరెన్నిక గల నల్లమల అడవులు.

Update: 2024-11-04 14:29 GMT

దిశ, కొల్లాపూర్: దేశంలోనే ఎంతో పేరెన్నిక గల నల్లమల అడవులు. ఈ అడవుల్లోనే తెలంగాణకు మరో ఊటీగా అమరగిరి ప్రాచుర్యం పొందుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రానికి తూర్పు దశన ఏడు కిలో మీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డున అమరగిరి గ్రామం ఉంది. దట్టమైన నల్లమల అడవులు, కొండల మధ్య గలగల పారుతూ పొంగి ప్రవహిస్తున్న కృష్ణానది కి ఇరువైపుల చుట్టూ ఎత్తైన కొండలు, ఆకుపచ్చ చీరాల విరబూసిన మహావృక్షాలు, వాటి సరసన వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ ఒడిలో అద్భుతంగా ఉండే ద్వీపకల్పాలు. అవే తెలంగాణకు మరో ఊటీని తలపించేలా ఉన్న చీమల తిప్ప, అమరగిరి ద్వీపకల్పాలు పర్యాటకుల హృదయాలను ఇంతగానో కట్టిపడేస్తాయి. ఆ పచ్చని ప్రకృతి అందాలు కళ్లకు వింపుగా ఉంటాయి. ఎంత చూసినా తరగని గనిలా..ఈ నల్లమల అడవుల గుండా సెలయేరులా పారే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఈ చూడ చక్కని ప్రకృతి అందాలతో ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. కొల్లాపూర్ నుంచి ప్రత్యేకంగా అద్దెకు ప్రైవేటు వాహనాల్లో అమరగిరికి చేరుకోవాలి. అమరగిరి గ్రామానికి కుడి వైపున కృష్ణానది ఒడ్డున కొండగట్టున పురాతన ఆలయం అదే మల్లయ్య పుణ్యక్షేత్రం ఉంది. అక్కడికి మరబోటులో చేరుకోవాలి. అలాగే గ్రామం నుంచి ఎనిమిది కిలో మీటర్లు దూరం నది అలల పై మరబోటులో ప్రయాణం చేస్తూ...మార్గమధ్యంలో నది మధ్యన మహా అద్భుతంగా ద్వీపకల్పం ఉంది. అదే చీమలతిప్ప.

ఈ కొండ పై గత రెండున్నర దశాబ్దాలకు పైగా నదిలో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన 50 మత్స్యకారుల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడి నుంచి అర కిలో మీటరు దూరంలో నదిపై ప్రయాణిస్తే.. 1200 మీటర్ల ఎత్తయిన కొండ. ఆ కొండ పైన కాకతీయుల కాలం నాటి పురాతన అంకాలమ్మ కోట ఆలయం ఉంది. ఈ కోటపై నాలువైపుల పెద్ద పెద్ద బండరాళ్ళతో కోటల నిర్మాణం, మండువేసవిలోనూ వట్టిపోకుండా ఈ కోటపై నీటి కోలను ఉండడం విశేషం. వారంలో రెండు రోజులు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రాంతాలకు చెందిన జాలర్లు,మత్సకారులు, చెంచులు, అంకాలమ్మ దేవతను భక్తిశ్రద్ధలతో పోటీలు కోళ్లు బలిచి పూజిస్తారు. అటు ఆధ్యాత్మికం ప్రదేశాలు.. ఇటు పర్యాటక ప్రాంతాలుగా ఎంతగానో ఆకట్టుకుంటూ న్నాయి. అయితే తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో..అమరగిరి ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దిందు కోసం ఇటీవల ఆ శాఖ అధికారులు పర్యటించి టూరిస్ట్ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి మంజూరు కోసం ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు పంపిన విషయం విధితమే.


Similar News