కృష్ణా నదికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా గద్వాలకు సమీపంలోని నది అగ్రహారం
దిశ,గద్వాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా గద్వాలకు సమీపంలోని నది అగ్రహారం ఒడ్డున ఉన్న కృష్ణానదికి భక్తులు పోటెత్తారు. గద్వాల పట్టణం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో నది అగ్రహానికి తరలివచ్చారు.నేడు శివుడు మహా విష్ణువుకు ఇష్టమైన రోజు కావడంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తుంటారు. నదిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అనంతరం శివాలయంలో పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.