లారీ ,కారు ఢీకొని 6 మంది పరిస్థితి విషమం
కారు లారీ ఢీ కొని ఆరుగురు తీవ్ర గాయాలైన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, దేవరకద్ర :కారు లారీ ఢీ కొని ఆరుగురు తీవ్ర గాయాలైన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దేవరకద్ర మండలం పెద్ద గోప్లాపూర్ గ్రామ స్టేజి సమీపంలో మహబూబ్ నగర్ నుండి మరికల్ వైపు వస్తున్నకారు శక్తి నగర్ నుండి బొగ్గులోడుతో మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నజ్జునుజ్జయింది .దీంతో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉండడంతో..వైద్యం నిమిత్తం అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు. గంట సేపు కారులో ఇరుక్కుపోయి కారు డ్రైవర్ నరకయాతన అనుభవించాడు. పెద్ద గోపులాపూర్ గ్రామస్తుల సహకారంతో ఎస్సై నాగన్న తన సిబ్బందితో కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను జేసిబి సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.