యువతీ, యువకులకు 30 రోజుల ఎలక్ట్రిషన్ ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

గద్వాల జిల్లాలో ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు 30 రోజులు ఉచితంగా ఎలక్ట్రిషియన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-12 09:15 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల జిల్లాలో ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు 30 రోజులు ఉచితంగా ఎలక్ట్రిషియన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్ ఎస్ డి సి సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని, మహిళలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు.10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎలక్రీషియన్ (ఐ టి ఐ ఎలక్ట్రిషియన్ / ఇతరులు) చదివిన వారు అర్హులని తెలిపారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయస్సు గలవారు అర్హులు అన్నారు. ఇతర వివరాలకు 6303430789, 9030421360 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు.


Similar News