చెక్ డ్యామ్‌లో మొసలి సంచారం.. భయాందోళనలో రైతులు

మండల కేంద్రానికి సంబంధించిన చెక్ డ్యామ్‌లో ఓ ముసలి సంచారిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2024-09-19 04:24 GMT

దిశ, ఊట్కూర్ : మండల కేంద్రానికి సంబంధించిన చెక్ డ్యామ్‌లో ఓ మొసలి సంచారిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈనెల 17న ఈవెనింగ్ టైం లో అదే ప్రాంతంలో ఉన్న రైతులు వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికి వస్తుండగా మొసలిని చూసి కంగుతిన్నారు. అదే రోడ్డు మార్గాన రైతులు, గొర్రెల కాపరులు నిత్యం తిరుగుతుండటం అటు వైపు వెళ్లాల్సి వస్తుందంటేనే ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంతో పాటు ఓబులాపూర్ గ్రామానికి శివారులో ఉన్న చిన్న వాగు పై కొన్నాళ్ల క్రితం చెక్ డ్యామ్‌ను నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వరదలకు చెక్ డ్యాం ద్వారా సంఘం బండ రిజర్వాయర్‌కు నీరు చేరింది. దీంతో భారీ వరద నీటి ప్రవాహానికి మొసలి వచ్చి చెక్ డ్యామ్‌లో చేరి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇప్పటికీ మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పోరాటంతో చెక్ డ్యామ్ ద్వారా నీరు దిగువకు వెళ్తుంది. దీంతో ఇప్పట్లో నీరు కిందకు వదిలేందుకు అవకాశం లేదని తెలుస్తుంది. జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి మొసలిని వేరే ప్రాంతానికి తరలించాలని ఆ ప్రాంతం రైతులు, గొర్రెల కాపరులు కోరుతున్నారు.

కాగా జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. సిబ్బందిని పంపించడం జరుగుతుందని, మొసలి ఎక్కడ ఉందో తెలుసుకుంటామని, అటువైపుగా పశువుల కాపరులు, రైతులను వెళ్లొద్దని హెచ్చరించారు.


Similar News