23 ఏళ్లుగా వెట్టి చాకిరీ... కానీ ఉద్యోగ భద్రత కరువు

సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల, జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ ఉద్యోగులు 23 ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని 15 వందల మంది పని చేస్తున్నామని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం కాళోజీ ప్రజా భవన్‌లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

Update: 2024-02-20 11:10 GMT

దిశ, అచ్చంపేట: సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల, జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ ఉద్యోగులు 23 ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని 15 వందల మంది పని చేస్తున్నామని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం కాళోజీ ప్రజా భవన్‌లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత, కనీస వేతనం అందక అత్యంత పేదలుగా మిగిలామని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు వాపోయారు.

ప్రజాభవన్‌లో ప్రజావాణి కమీషనర్ దివ్యకు వినతి పత్రం అందించమన్నారు. 2013 సం.లో ఉద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రక్రియ ముందుకు సాగ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు తిరిగిన తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందారు. ప్రజాపాలన లోనైనా పెండింగ్‌లో ఉన్న తమ ఫైల్ అప్రూవల్ చేయించి ఉద్యోగ భద్రత, కనీస వేతనం అందించి ఆదుకోవాలని కోరారు. కింది స్థాయిలో ఉన్న వీఓఏ లకు సైతం ప్రభుత్వం వేతనం చెల్లిస్తుందని, తమకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో కవిత, స్వప్న, లలిత, ధనలక్ష్మి, ఇందిర పాల్గొన్నారు.


Similar News