పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 2-సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 2-సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. 2024-25 సంవత్సరానికి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకిషన్ మంగళవారం ప్రకటనలో కోరారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో..జరిగే ఈ అడ్మిషన్ ల కోసం విద్యార్థులు నేరుగా తమ దరఖాస్తులను తేదీ: 15-11- 2024 నుంచి 21-11-2024 వరకు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు నమూనా వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి..దరఖాస్తులు,జిరాక్స్ సర్టిఫికెట్లు తో అప్పక్ పల్లి లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 2-సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సు కోసం డయాలసిస్ -30, ఈసీజీ -30 సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు.