స్కూటీలో దూరిన కట్ల పాము.. ఎంత పనిచేసిందంటే..?
పుట్టలో పాము స్కూటీలో వచ్చి చేరితే ఎలా ఉంటుంది..అమ్మో.. ఇంకేమైనా ఉందా.? పామును చూడగానే ప్రాణం ఆగిపోతుంది.. ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలియక కళ్ళముందే నరకం కనిపిస్తుంది.
దిశ, గద్వాల: పుట్టలో పాము స్కూటీలో వచ్చి చేరితే ఎలా ఉంటుంది..అమ్మో.. ఇంకేమైనా ఉందా.? పామును చూడగానే ప్రాణం ఆగిపోతుంది.. ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలియక కళ్ళముందే నరకం కనిపిస్తుంది. స్కూటీని నడిపేందుకు సిద్ధపడుతుండగా కట్లపాము అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో..ఓ వాహనదారుడు భయాందోళనకు గురైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీరెల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. చౌరస్తాలోని ఒక స్కూల్ సమీపంలో వాహనాన్ని పార్కు చేసి..పని ముగించుకుని వాహనాన్ని స్టార్ట్ చేశాడు. దీంతో ఓ కట్లపాము ప్రత్యక్షమైంది. ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని ఆపేసి చుట్టుపక్క వారికి తెలిపాడు. స్కూటీ ముందు భాగంలోని గ్యాప్ లో కట్లపాము దాగి ఉండడంతో..స్థానికుల సహాయంతో ముందు భాగాన్ని తీసి చూడగా పాము మరో మార్గంలో ప్రత్యక్షమైంది. దీంతో కట్టెతో చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత విష సర్పమైన కట్లపాము,నాగుపాము కంటే ప్రమాదకరమైంది. ఇలా వాహనాల్లో పాములు ప్రవేశించకుండా ముందస్తుగా గమనించి వాహనాన్ని నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.