BREAKING: అసదుద్దీన్ ఓవైసీపై ఈసీకి కంప్లైంట్ చేసిన మాధవీలత

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Update: 2024-05-06 12:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన మాధవీలత.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని కంప్లైంట్ చేశారు. ఈ మేరకు ఓవైసీపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓవైసీతో పాటు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌పైన ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్‌కు శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ సమర్పించిన అఫిడవిట్‌ను మరోసారి పరిశీలించి ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.

ఇక, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ పోరు ఈ సారి స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత 40 ఏండ్ల నుండి ఏకధాటిగా హైదరాబాద్‌ను పాలిస్తున్న ఎంఐఎంను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అనే మహిళలకు ఎంపీ టికెట్ ఇచ్చి ఓవైసీని ఢీకొట్టేందుకు బరిలోకి దింపింది. బీజేపీ అంచనాలకు తగ్గట్లే మాధవీలత సైతం ఓవైసీతో హోరాహోరీగా తలపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Read More...

ఈసీకి, పోలీసులకు హైదరాబాద్‌ పోలింగ్‌ బూత్‌లపైనే ఎందుకు దృష్టి: అసదుద్దీన్‌ ఒవైసీ 


Similar News