కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే.. గులాబీలో గుబులు!

అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నేతల వలసలు మాత్రం ఆగడం లేదు.

Update: 2024-07-15 15:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. సెంకడ్ క్యాడర్ నుంచి కీలక నేతల వరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. పార్టీలో కీలక నాయకుడిగా ఉండి.. ఎమ్మెల్యేగా గెలిచిన పలువురు నేతలు సైతం పార్టీ మారుతున్నారు. వారు గులాబీ బాస్ కేసీఆర్ మాటలను సైతం లెక్క చేయడం లేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని ఒకపక్క కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది.

కడియం శ్రీహరి- ఘనపూర్ స్టేషన్

దానం నాగేందర్- ఖైరతాబాద్

తెల్లం వెంకట్రావు- భద్రాచలం

పోచారం శ్రీనివాస్ రెడ్డి- బాన్సువాడ

ఎం సంజయ్ కుమార్- జగిత్యాల

కాలె యాదయ్య- చేవెళ్ల

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల్

ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్

గూడెం మహిపాల్ రెడ్డి- పటాన్‌చెరు

అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి

కాగా, ఎమ్మెల్యేల వలసల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగిన కూడా.. ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండడం గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

Tags:    

Similar News