మందుబాబులకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన వినాయక చవితి పండుగ వాతావరణం కనిపిస్తుంది. భారత్ లో 10 రోజుల పాటు సాగే ఈ పండగను యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

Update: 2024-09-12 13:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన వినాయక చవితి పండుగ వాతావరణం కనిపిస్తుంది. దేశంలో 10 రోజుల పాటు సాగే ఈ పండుగను యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు ప్రత్యేకత ఉంది. చివరి రోజు అన్ని విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు వస్తుంటే ఆ శోభాయాత్రలు అద్భుతంగా కనివిందు చేస్తుంటాయి. లక్షల మంది ఒకే చోట చేరుకునే పండుగ కావడంతో..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు బందు చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటానికి.. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. అలాగే స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని పేర్కొన్నారు.


Similar News